వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, టైగర్ నాగేశ్వరరావు నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆగష్టు 11, 2023న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఈ తేదీన విడుదల అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనాన్ అండ్ ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.