"సలార్" సినిమాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కి జోడిగా అందాల తార శ్రుతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. కదా. మోస్ట్ హైప్డ్, మోస్ట్ యాంటిసిపేటెడ్ సలార్ లో శృతి 'ఆద్య' పాత్రలో నటిస్తుంది.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, ఆద్య పాత్రకు సంబంధించిన మొత్తం షూట్ ని ఈ రోజుతో శృతి పూర్తి చేసినట్టుగా మేకర్స్ నుండి స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది.
కేజిఎఫ్ తో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు.