సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం "పఠాన్". జాన్ అబ్రహం విలన్గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. జనవరి 25వ తేదీన నాన్ హాలిడే అయినటువంటి బుధవారం నాడు విడుదలైన ఈ సినిమా తాజాగా, విజయవంతంగా నాల్గవ వారంలోకి అడుగుపెట్టింది.
పఠాన్ కలెక్షన్లు 500NBOC మార్క్ అందుకున్న సందర్భంగా భారతదేశం మొత్తమ్మీద ఉన్న PVR, INOX, సినీపోలిస్ ఇతరత్రా థియేటర్లలో గత శుక్రవారం టికెట్ రేట్లను 110/- ఫ్లాట్ చేసిన మేకర్స్ ఆపై వీక్ డేస్ లో అంటే ఈ సోమవారం నుండి గురువారం వరకు కూడా టికెట్ రేట్లను ఫ్లాట్ 110/- గానే ఫిక్స్ చేసారు. ఈ విషయం తెలిసిందే. ఐతే, ఈ ఆఫర్ ను రేపు కూడా అలానే ఉంచబోతున్నారు మేకర్స్. శుక్రవారం కూడా పఠాన్ ఆల్ ఓవర్ ఇండియా షోలకు 110/- రూపాయలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది అంటూ కాసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.