మోస్ట్ అవైటెడ్ సార్ మూవీ సర్ప్రైజ్ కాసేపటి క్రితమే వచ్చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరకల్పనలో రూపొందిన మెలోడియస్ లవ్ ట్రాక్ "మాస్టారూ మాస్టారూ" పాటకి శ్రోతల నుండి విశేష స్పందన వస్తుండగా, తాజాగా ఈ పాటను హీరో ధనుష్ స్వయంగా ఆలపించిన వెర్షన్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. రామజోగయ్యశాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. ధనుష్ నోట తెలుగు పాట ఎంత అద్భుతంగా పలికిందో..!!