ఫిబ్రవరి 24న అంటే రేపు నాచురల్ స్టార్ నాని 39వ పడిలోకి అడుగుపెడుతున్నారు. నాని పుట్టినరోజుకి దసరా మేకర్స్ వినూత్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇండియా వైడ్ ఉన్న 39 ముఖ్యకేంద్రాలలో మూవీ కౌంట్ డౌన్ ఇన్స్టలేషన్స్ చేస్తున్నారు. ఇదే కాకుండా దసరా మూవీ మొత్తం నడిచే గోదావరి ఖని చౌరస్తాలో రేపు ఉదయం పదకొండు గంటల నుండి నాని బర్త్ డే సెలెబ్రేషన్స్ అట్టహాసంగా జరగబోతున్నాయి. ఈ వేడుకలకు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల హాజరు కాబోతున్నారు. మరి నాచురల్ స్టార్ ఫాన్స్... గెట్ రెడీ టు పార్టిసిపేట్.