నటసింహం నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ లో అత్యుత్తమ ఫస్ట్ డే కలెక్షన్లను రాబట్టిన సినిమా "వీరసింహారెడ్డి". సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. తాజాగా కాసేపటి క్రితం నుండే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అదికూడా పాన్ ఇండియా భాషల్లో. మరి, ఇక్కడ వీరసింహారెడ్డి సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీరోల్స్ లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.