యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడిగా సినీరంగానికి పరిచయమైన హీరో ధృవ సర్జ. లేటెస్ట్ గా ధృవ సర్జ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం "మార్టిన్" యొక్క టీజర్ విడుదలయ్యింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన టీజర్ యాక్షన్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా టీజర్ కట్ చాలా బాగుంది. AP అర్జున్ దర్శకత్వంలో ఆర్మీ వార్ బ్యాక్ డ్రాప్ లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వాసవి ఎంటర్ప్రైసెస్, ఉదయ్ మెహతా ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్ లపై ఉదయ్ మెహతా నిర్మిస్తున్నారు. రవి బసృర్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.