ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆయన నటించిన పుష్ప మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాకు ముందే దర్శకుడు వేణు శ్రీరామ్ గతంలో అల్లు అర్జున్‌తో ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా కంటే ముందే ఈ సినిమాను అనౌన్స్ చేశారు వేణు. ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఆ సినిమా నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.