సురేందర్ రెడ్డి డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న సినిమా "ఏజెంట్". ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ టు సినిమాస్ సంయుక్త బ్యానర్ లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ రోజు నుండి ఏజెంట్ ఫైనల్ షెడ్యూల్ మస్కట్ లో ప్రారంభం కానుంది. విశేషమేంటంటే, ఈ షెడ్యూల్ తో ఏజెంట్ షూటింగ్ ఇక ముగిసినట్టే. ఈ షెడ్యూల్ లో చిత్రబృందం కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అక్కడ 15రోజుల పాటు ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.
పోతే, ఏజెంట్ మూవీ పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 28వ తేదీన విడుదల కాబోతుంది.