డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నిన్న సాయంత్రం ఆరింటి నుండి పాన్ ఇండియా భాషల్లో వీరసింహారెడ్డి మూవీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. సంక్రాంతి పందెంకోడి గా బరిలోకి దిగిన ఈ బిగ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్ ఆడియన్స్ నుండి ఎలాంటి స్పందన పొందిందో డిజిటల్ ఆడియన్స్ నుండి అలాంటి భీకర స్పందననే అందుకుంటుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కేవలం ఒకే ఒక్క నిమిషంలో 150కే వ్యూయర్స్ ఈ సినిమాను చూసారు. దీంతో సదరు ఓటిటిలో వీరసింహారెడ్డి సరికొత్త రికార్డును సృష్టించినట్టయ్యింది. మరైతే, ఇంకెన్ని డిజిటల్ రికార్డులను వీరసింహారెడ్డి బద్దలు చేస్తాడో చూడాలి..
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.