తెలుగు ఓటిటి ఆహాలో 'న్యూసెన్స్' అనే సరికొత్త వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. కలం, కాసు, కామం, మోహం, కవర్ అప్, క్లోజ్ అప్, కన్నీరు, పన్నీరు, సత్యం, అసత్యం, అర్ధసత్యం, నగ్నసత్యం, అన్నిటి నడుమన ఆరితేరిన ఆటగాళ్ల ఆట !!తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మిని చేసే అరుదైన ఆటగాళ్ల ఆట ...అని పేర్కొంటూ ఆహా సంస్థ రీసెంట్గానే 'న్యూసెన్స్' అనే వెబ్ సిరిస్ ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ పూడి ఈ వెబ్ సిరీస్ కు డైరెక్టర్ కాగా, బిందు మాధవి ప్రధానపాత్రలో నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సిరీస్ యొక్క టీజర్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. టైటిల్ తోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సిరీస్ యొక్క టీజర్ పై అంతటా ఆసక్తి నెలకొంది.