యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి షూటింగ్‌ను ముగించుకున్నట్లుగా తెలిపింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, కెమెరా మ్యాన్ భువన్ గౌడతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.