రేడియో జాకీగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి తదుపరి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఇక్కడ క్లాప్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్, హీరో...అంచలంచెలుగా ఎదుగుతూ, నాచురల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థానం సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఘంటా నవీన్ బాబు అదేనండి మన 'నాని'. ఈ రోజు నాని 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నానికి అశేష ప్రేక్షకలోకం పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తుంది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో నాని గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటుంది.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకోవచ్చని రుజువు చేసిన అతి కొద్దిమంది హీరోలలో నాని ఒకరు. అష్టా చమ్మా తో మొదలైన నాని సినీ ప్రయాణం తాజాగా పాన్ ఇండియా మూవీ 'దసరా' వరకు దిగ్విజయంగా కొనసాగుతుంది.