పాన్ ఇండియా భాషల్లో ఫిబ్రవరి 3న విడుదలైన యంగ్ హీరో సందీప్ కిషన్ న్యూ మూవీ "మైఖేల్". ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. రంజిత్ జయకొడి దర్శకత్వంలో ఇంటెన్స్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటించారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయా భరద్వాజ్, అయ్యప్ప శర్మ కీలకపాత్రల్లో నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు.
ఐతే, విడుదలైన మూడు వారాల వ్యవధిలోనే ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.