తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హార్రర్ ఫ్లిక్ 'మసూద' సక్సెస్ఫుల్ థియేట్రికల్ రన్ తో, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్లను వసూలు చేసింది. ప్రస్తుతం ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్న మసూద అక్కడ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ బుల్లితెర ఛానెల్ జెమిని లో అతి త్వరలోనే మసూద మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, ముఖ్యపాత్రల్లో నటించారు. శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, సత్యం రాజేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. దిల్ రాజు గారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసారు.
![]() |
![]() |