2010లో విడుదలైన 'ఓం శాంతి' సినిమాలో హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవి కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు 'న్యూసెన్స్' లో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. తెలుగు ఓటిటి ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపొందుతున్న న్యూసెన్స్ లో వీరిద్దరూ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా కాసేపటి క్రితమే ఈ సిరీస్ యొక్క టీజర్ విడుదలయ్యింది. మీరు చూసే ప్రతి న్యూస్ నిజమేనా? ఇది నిజం అని చూపిస్తున్నారా?... అనే ట్యాగ్ తో విడుదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. పోతే, ఈ వెబ్ సిరీస్ ని ప్రవీణ్ పూడి డైరెక్ట్ చేస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.