దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సంయుక్త నిర్మాణంలో, శిరీష్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం "బలగం". వేణు యెలదండి దర్శకత్వంలో ఫీల్ గుడ్ విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ కి శ్రోతల నుండి చాలా మంచి స్పందన రాగా తాజాగా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు థర్డ్ సింగిల్ ని విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. పోతే, ఈ మూవీ మార్చి 3వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa