పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ గా మార్చబోతున్న చిత్రం "ప్రాజెక్ట్ కే". నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సరికొత్త కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని కీరోల్స్ లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రొమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.
తాజాగా జరిగిన ఒక మీడియా ఇంటిరాక్షన్ లో నిర్మాత అశ్వినీదత్ ప్రాజెక్ట్ కే కి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని సీన్/ సీక్వెన్స్ గతంలో ఎప్పుడూ చూసి ఉండరని, అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఇంకా కొంతమంది లోకల్ ట్యాలెంట్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారని , యాక్షన్ సీక్వెన్సెస్ నెవర్ బిఫోర్ అన్న రేంజులో ఉంటాయని చెప్పుకొచ్చారు. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని, చాలా ఎక్జయిటింగ్ గా ఫీల్ అవుతున్నామని అశ్వినీదత్ పేర్కొన్నారు.
పోతే, ఈ సినిమా జనవరి 12, 2024లో విడుదల కాబోతుంది.
![]() |
![]() |