మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా "ప్రాజెక్ట్ కే". దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీరోల్స్ లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై CH అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ప్రాజెక్ట్ కే చిత్రీకరణ డెబ్బై శాతం పూర్తయ్యిందని తెలుస్తుంది. 5 నెలల క్రితం 5 VFX కంపెనీలలో ప్రాజెక్ట్ కే VFX పనులు మొదలయ్యాయని, ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తుంది. అలానే దీపికా, అమితాబ్ లకు సంబంధించిన చిత్రీకరణ భాగం కేవలం 7-10 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ప్రాజెక్ట్ కే మెయిన్ ఫోకస్ ప్రభాస్ అని, ఐతే, ప్రభాస్, దీపికా, అమితాబ్.. ఈ మూడు పాత్రలు సినిమాను నడిపిస్తాయి.. అంటూ నిర్మాత అశ్వినీదత్ గారు ప్రాజెక్ట్ కే సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
![]() |
![]() |