అలనాటి అందాల తార శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఆమె భర్త బోనీ కపూర్ సామాజిక మాధ్యమాల్లో వరుసగా పోస్టులు చేస్తున్నారు. 1984లో తొలిసారిగా శ్రీదేవితో దిగిన ఫోటో, శ్రీదేవి ఆయనకు ముద్దు పెడుతున్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవి దూరమై ఐదేళ్లు గడుస్తున్నా, ఇంకా ఆమె జ్ఞాపకాల్లోనే బోనీకపూర్, జాన్వీకపూర్ ఉన్నారని అంటున్నారు.