ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో ధుమ్ము రేపుతున్న సంతోష్ శోభన్ న్యూ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 11:35 AM

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కొత్త చిత్రం "కళ్యాణం కమనీయం". అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్షన్లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ టాలీవుడ్ డిబట్ చేసింది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించగా, యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది.


సంక్రాంతి కానుకగా థియేటర్లకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నెల 17 నుండి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఆహాలో ఈ మూవీ 100మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని పూర్తి చేసుకుంది. చెప్పాలంటే, థియేటర్లలో కన్నా ఈ సినిమాకు డిజిటల్లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa