ఈ నెల 17వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదలైన "సార్ / వాతి" మూవీ కి ఆడియన్స్ నుండి యూనానిమస్ గా సూపర్ హిట్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
తాజా అధికారిక సమాచారం మేరకు, 8 రోజుల్లో సార్/వాతి మూవీ ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది. ఒక ఈవెంట్లో మాట్లాడుతూ డైరెక్టర్ వెంకీ అట్లూరినే స్వయంగా ఈ విషయాన్ని స్టేజ్ మీద వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa