ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రంలో బెంగళూరు బ్యూటీ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 04:21 PM

టాలీవుడ్  పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తమిళ హిట్ సినిమా వినోదయ సీతం రీమేక్ చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఒక స్పెష‌ల్ సాంగ్ ఉంటుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ లో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో ధమాకా బ్యూటీ శ్రీలీల పెయిర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాటను అతి త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ విషయం గురించి మూవీ టీమ్ నుండి అధికారక ప్రకటన ఇంకొన్ని రోజులలో వెలువడనుంది.

ఫాంటసీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి సముద్రకని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బిగ్గీలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ZEE5తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa