RRR గ్లోబల్ సక్సెస్ తదుపరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడంతో ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమవ్వాల్సిన ఈ సినిమా తారకరత్న అకాల మరణం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరగబోయే రోజుపై ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. అదేంటంటే, మార్చి 18వ తేదీన ఈ సినిమా అధికారికంగా ప్రారంభించబడుతుందని, అలానే వచ్చే నెల మొదటి వారంలో తారక్ సరసన నటించబోయే హీరోయిన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతుందని వినికిడి.
ఈ సినిమాకు కొరటాల శివ డైరెక్టర్ కాగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్త బ్యానర్లు నిర్మిస్తున్నాయి.