బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుండి కాసేపటి క్రితమే పూనకాలు లోడింగ్ సాంగ్ ఫుల్ వీడియో విడుదలయ్యింది. డోంట్ స్టాప్ డాన్సింగ్ ...పూనకాలు లోడింగ్ ... అని మెగాస్టార్, మాస్ రాజా అంటుంటే, తెరపై చిందేస్తుంటే... చూసే ఆడియన్స్ కి పూనకాలు రాకుండా ఉంటాయా.. అందుకే ఈ సాంగ్ కి పూనకాలు లోడింగ్ అని పేరు పెట్టారేమో అనిపిస్తుంది. రామ్ మిరియాల, రోల్ రైడా అద్భుతమైన గానం, DSP రాకింగ్ మ్యూజిక్, రోల్ రైడా లిరిక్స్.. మెగాస్టార్, మాస్ రాజాల క్రేజీ డాన్స్ మూవ్స్.. టోటల్ గా పూనకాలు లోడింగ్ సాంగ్ థియేటర్ల గోడల్ని బద్దలు కొట్టింది.