సూపర్ స్టార్ మహేష్ బాబు గారి న్యూ మూవీ రీసెంట్గానే ఒక షెడ్యూల్ ని ముగించుకోగా, తాజాగా రేపటి నుండి కొత్త షెడ్యూల్ ని ప్రారంభించబోతుంది. న్యూ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చెయ్యబడిన సెట్స్ లో జరగబోతుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలకపాత్రధారులందరూ పాల్గొననున్నారు. అలానే ఈ షెడ్యూల్ కొన్నిరోజుల పాటు నిరవధికంగా జరగబోతుందని తెలుస్తుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.