మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన "వాల్తేరు వీరయ్య" సంక్రాంతి కానుకగా ధియేటర్లకొచ్చి, అశేష ప్రేక్షకాభిమానుల నీరాజనాలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మెగా మాస్ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా ఇప్పటివరకు 250కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. అంటే వీరయ్య డిజిటల్ సందడి మరికొన్ని గంటల్లోనే షురూ కానుందన్న మాట.
డైరెక్టర్ బాబీ రూపొందించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో మాస్ రాజా రవితేజ క్రూషియల్ రోల్ లో నటించారు. శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా, బాబీ సింహ, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి కీరోల్స్ లో నటించారు.