రౌడీ హీరో విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన గతనెలలో జరిగింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు స్వరాలను సమకూర్చేందుకు మేకర్స్ కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ని ఎంచుకున్నారని తెలుస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.