క్రేజీ హీరోయిన్ సమంత నేటితో సినీరంగ ప్రవేశం చేసి 13 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ప్రేక్షకాభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు హార్దిక శుభాకాంక్షలను తెలియచేస్తూ, ఫ్యూచర్ లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు.
సమంత నటించిన తొలి చిత్రం "ఏ మాయ చేసావే" సరిగ్గా ఇదే రోజు 2010లో విడుదలై, సంచలన విజయం సాధించింది. మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకుంది.అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో సమంతకు ఆఫర్లు వెల్లువెత్తాయి.వరసగా స్టార్ హీరోలతో జత కట్టింది.కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.సమంత సినిమాల లిస్ట్ చూస్తే హిట్ సినిమాలే ఎక్కువ ఉంటాయి.కెరీర్లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది.2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. విడాకులనంతరం తన సినిమాల స్పీడ్ మరింత పెంచింది.అల్లు అర్జున్ నటించిన "పుష్ప" సినిమాలో ఐటెం సాంగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
"యశోద" సినిమాతో గతేడాది పాన్ ఇండియా సూపర్ హిట్ కొట్టిన సమంత మరో రెండు నెలల్లో "శాకుంతలం" సినిమాతో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యింది. ఇంకా బాలీవుడ్ లో "సిటాడెల్" అనే ప్రెస్టీజియస్ వెబ్ సిరీస్ లో సమంత ఫిమేల్ లీడ్ లో నటిస్తుంది. "ఎరేంజ్మెంట్స్ అఫ్ లవ్" అనే సినిమాతో త్వరలోనే హాలీవుడ్లో కూడా అడుగు పెట్టనుంది. విడాకుల తరవాత కుంగుబాటుకు లోనుకాకుండా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ,యువతకు ఆదర్శంగా నిలుస్తుంది సమంత.