ఇటీవల పాన్ ఇండియా భాషల్లో విడుదలైన హార్ట్ బ్రేక్ యాంథెం 'ఓరి వారి' పాటకు అన్ని భాషల శ్రోతల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న దసరా సినిమాలోనిది ఈ పాట. తాజాగా ఈ పాట యొక్క మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. ఈ వీడియోలో అన్నిభాషల లిరిక్స్ ని ఒకేసారి పాడడం చాలా బాగుంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెల 30వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతోంది.