సూపర్ హిట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్, 'వారిసు' బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ సక్సెస్ జోష్ లో ఉన్న తలపతి విజయ్ కలయికలో రాబోతున్న రెండవ చిత్రం "లియో". ఈ మధ్య విడుదలైన టైటిల్ టీజర్ వీడియో ఆడియన్స్ లో మంచి అంచనాలను ఏర్పరిచింది. గత నెల 2 వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వగా, ప్రస్తుతం కాశ్మీర్ లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 400కోట్లకు జరిగిందని వినికిడి. మాస్టర్ బ్లాక్ బస్టర్ తో ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాలే ఇందుకు కారణమని తెలియకనే తెలుస్తుంది.
![]() |
![]() |