ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలగం ట్రైలర్ రిలీజ్ డేట్ & టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2023, 08:14 PM

'జబర్దస్త్' ఫేమ్ వేణు టిల్లు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "బలగం". ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్, హన్షిత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 


ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుండగా, తాజాగా చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఈ మేరకు రేపు ఉదయం పదకొండు గంటలకు బలగం ట్రైలర్ విడుదల కాబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. 


పోతే, మార్చి 3వ తేదీన ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com