కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కె. విశ్వనాథ్ ఈ నెల 2న కన్నుమూశారు, ఈరోజు ఆయన భార్య జయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. జయలక్ష్మికి గుండెపోటు వచ్చింది. జయలక్ష్మికి 86 ఏళ్లు. కె. విశ్వనాథ్ మృతి చెందినప్పటి నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, జయలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.