సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'భువన విజయమ్'. ఈ సినిమాకి కొత్త దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని దర్శకుడు వేణు ఉడుగుల రిలీజ్ చేశారు. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.ఈ సినిమాని హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నరు. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.