మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. నిన్న అర్థరాత్రి నుండి డిజిటల్ ఆడియన్స్ ని అలరించడం మొదలెట్టిన వాల్తేరు వీరయ్య అక్కడ ఎలాంటి విజయం దక్కించుకుంటాడో అని అంతటా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, ఆల్రెడీ ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ మరి.
బాబీ దర్శకత్వంలో ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.