ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వక్సేన్ 'ధమ్కీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ కి ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2023, 03:53 PM

మాస్ కా దాస్ విశ్వక్సేన్ తదుపరి యాక్షన్ కామెడీ డ్రామా అయిన 'దాస్ క ధమ్కీ' లో కనిపించనున్నారు. నటుడు స్వయంగా దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియన్ చిత్రం మార్చి 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 18న జరగనున్న ధమ్కీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ కి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ త్వరలో సోషల్ మీడియాలో ప్రకటించనున్నారు.

ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ విశ్వక్సేన్ కి జోడిగా నటిస్తుంది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa