హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే ఆయన అప్ కమింగ్ మూవీ "సామజవరగమన" నుండి స్పెషల్ గ్లిమ్స్ విడుదలయ్యింది. ఈ గ్లిమ్స్ వీడియో ఫుల్ పాజిటివ్ వైబ్స్ తో, ఫుల్ ఆన్ ఫన్ గా సాగింది. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ అండ్ యాక్టింగ్ చాలా బాగుంది. ప్రేమించి పెళ్ళిచేసుకునే వాళ్ళకి క్యాస్ట్ ప్రాబ్లెమ్ వస్తుంది లేకపోతే క్యాష్ ప్రాబ్లెమ్ వస్తుంది. ప్రపంచంలో ఎవరికీ రాని వింత ప్రాబ్లెమ్ నాకొచ్చిందేంట్రా ? లవ్ మ్యారేజ్ లో కూడా ఇలాంటి ప్రాబ్లెమ్ ఒకటుంటుందని నువ్ లవ్ చెయ్యడం వల్లే తెలిసిందిరా..? ... అనే డైలాగ్స్ తోనే ఈ సినిమా ఎంత ఫన్ అండ్ క్రేజీగా ఉండబోతుందో తెలుస్తుంది. పోతే, ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కాబోతుంది.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రెబ మోనికా హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. రాజేష్ దందా నిర్మిస్తున్నారు.