సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నుండి రాబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ "విరూపాక్ష". కార్తీక్ దండు దర్శకత్వంలో, సుకుమార్ అందించిన కధతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం, విరూపాక్ష సెట్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసారు. ఈ సందర్భంగా అక్కడే టీజర్ ను కూడా లాంచ్ చేసారు. టీజర్ చూసి పవన్ కళ్యాణ్ నుండి పవర్ఫుల్ అప్రిసియేషన్ వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. మరి, మనం ఈ టీజర్ ని చూడాలంటే, మార్చి 1 వరకు ఆగాల్సిందే.