గ్లోబల్ సెన్సేషన్ RRR రీసెంట్గానే 5 ప్రెస్టీజియస్ HCA అవార్డులను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాజమౌళి, రాంచరణ్, కీరవాణి, సెంథిల్, కార్తికేయ పాల్గొన్నారు. ఐతే, ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అబ్సెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరి, ఫ్యాన్స్ ఊరుకుంటారా...? HCA అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేస్తూ ఎన్టీఆర్ ని సత్కరించనందుకు ట్వీట్ల వర్షం కురిపించారు. దీంతో HCA సంస్థ ఎన్టీఆర్ అబ్సెన్స్ పై సాలిడ్ క్లారిఫికేషన్ ఇస్తూ ట్వీట్ చేసింది.
HCA అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వమని జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందింది. ఐతే, ఒక మూవీ షూటింగ్ నిమిత్తం జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కాలేకపోతున్నట్టు తెలిపారు. ఆయనకు అందాల్సిన అవార్డులు త్వరలోనే పంపిస్తాము...థాంక్యూ అంటూ HCA ట్వీట్ చేసింది.