కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా కొత్తదర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన రొమాంటిక్ థ్రిల్లర్ "RX 100" మూవీకి ప్రేక్షకుల నుండి ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఆపై అజయ్ భూపతి 'మహాసముద్రం' సినిమా తెరకెక్కించి, భారీ పరాజయాన్ని అందుకున్నారు.
తాజాగా ఇప్పుడు న్యూ మూవీ ఎనౌన్స్మెంట్ చేసారు. "మంగళవారం" టైటిల్ తో విడుదలైన పోస్టర్ ఇంట్రిగ్యుయింగ్ గా ఉంది. ఈ సినిమా పాన్ సౌత్ భాషల్లో విడుదల కాబోతుంది. ముద్ర మీడియా వర్క్స్, A క్రియేటివ్ వర్క్స్ సంయుక్త బ్యానర్ లపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.