గ్లోబల్ సెన్సేషన్ RRR ఆస్కార్ బెస్ట్ సాంగ్స్ రేస్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమం మార్చి 13వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా RRR ని ప్రోమోట్ చేసేందుకు ఆల్రెడీ చిత్రబృందం అమెరికాలోనే ఉంది..ఒక్క తారక్ తప్ప. రీసెంట్గానే ప్రెస్టీజియస్ HCA అవార్డుల కార్యక్రమంలో RRR చిత్రబృందం పాల్గొని 5 అవార్డులను చేజిక్కించుకుంది. న్యూ మూవీ ఓపెనింగ్ సెరిమోనీ, తారకరత్న మరణం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లలేదని తెలుస్తోంది. ఐతే, తాజా సమాచారం ప్రకారం, మార్చి 5వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ యూఎస్ కి బయలుదేరి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa