విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో బాలీవుడ్ గ్లామర్ డాల్ అనన్య పాండే ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. తాజాగా ఈరోజు అనన్య తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో దర్శకుడు మోత్వానేతో తన చిత్రాన్ని పోస్ట్ చేసి ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించింది. సైబర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ని త్వరలో మూవీ మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని నిఖిల్ ద్వివేది నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa