ఈ ఏడాది జరగబోయే 95వ అకాడెమీ అవార్డులకు మన ఇండియా నుండి గ్లోబల్ సెన్సేషన్ RRR సినిమాలోని, ఎం ఎం కీరవాణి స్వరకల్పనలో రూపొందిన నాటు నాటు ఛార్ట్ బస్టర్ సాంగ్ నామినేట్ ఐన విషయం తెలిసిందే. మరి, ఈ నెల 12 ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ ధియేటర్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.
ఇంతకూ అసలు విషయమేంటంటే, ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు నాటు నాటు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు అకాడెమి నుండి అఫీషియల్ ఇన్విటేషన్ వచ్చింది. ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డుల వేదికపై మన ఇండియన్ సాంగ్ అదికూడా తెలుగు పాట లైవ్ పెర్ఫార్మన్స్ వార్త క్రేజీగా మారింది.