మ్యాచో స్టార్ గోపీచంద్ తన వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటున్న శ్రీను యొక్క కొత్తింటి గృహప్రవేశానికి హాజరై, హార్దిక శుభాకాంక్షలను తెలియచేసారు. అక్కడ కొంతసేపు సరదాగా గడిపారు. గోపీచంద్ రాకతో అక్కడ సంతోషకరమైన వాతావరణం నెలకొంది.
గోపీచంద్ గతేడాది పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆడియన్స్ నుండి ఆ సినిమాకు చెప్పుకోదగ్గ స్పందన రాలేదు. తనకు రెండుసార్లు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన రామబాణం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి, ఈ సినిమాతోనైనా గోపీచంద్ గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.