నా వల్ల ఒక పది కుటుంబాలకు మంచి జరిగినా చాలు ఆ ఉద్దేశంతోనే ఆరేన్సిస్ కంపెనీకి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడానికి అంగీకరించా అన్నారు. ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ ముఖ్య సలహాదారు అలీ. మంగళవారం ఆస్ట్రేలియాకి చెందిన ఆర్వేన్సిస్ బృందంతో కలిసి హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు అలీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా చదువుకొని, ప్రతిభ ఉండి డబ్బుల్లేక ఇబ్బంది పడేవాళ్లకి సాయం చేస్తామని పేర్కొన్నారు. ఆర్వేన్సిస్ సీఈవో శశిధర్ కొలి కొండ మాట్లాడుతూ విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో సేవలు అందిస్తామన్నారు. మార్చి 3, 4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ సమ్మిటికి హాజరవుతామని చెప్పారు. కార్య క్రమంలో సంస్థ ప్రతినిధులు బ్రూస్ మ్యాన్ఫీల్డ్ తోపాటు, సుకన్య కంభంపాటి తదితరులు పాల్గొన్నారు.