బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నటుడు ధర్మేంద్ర సహా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీలకు ప్రాణహాని ఉందని, వారి ఇళ్లకు సమీపంలో బాంబులు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి నాగ్ పూర్ పోలీసులకు ఫోన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉగ్రదాడి కోసం 25 మంది తీవ్రవాదులు ముంబైలోని దాదర్ కు చేరుకున్నారని ఆ వ్యక్తి తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.