'మంత్ర', 'మంగళ' వంటి విజయవంతమైన సినిమాలకి దర్శకత్వం వహించిన ఓషో తులసి రామ్ ఇప్పుడు కబాలి ఫేమ్ సాయి ధన్సికతో కలిసి మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని అధికారకంగా ప్రకటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'దక్షిణ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.
తాజాగా ఇప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం, గోవా వంటి వివిధ నగరాల్లో 45 రోజుల్లోనే దక్షిణాది షూటింగ్ పార్ట్ పూర్తయిందని సమాచారం. సాయి ధన్సిక పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని కొన్ని స్టిల్స్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమా సైకో థ్రిల్లర్ చుట్టూ కథ తిరుగుతుందని లేటెస్ట్ టాక్. ఈ సినిమాకి బాలాజీ సంగీతం అందిస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అశోక్ షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.