మంచు విష్ణు, ఆయన సతీమణి విరానికా బుధవారం 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారి కూతుర్లు అరియానా, వివియానా ఓ వీడియోను బహుమతిగా అందించారు. ఈ వీడియోలో విష్ణు, విరానికాకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్ పొందిపరిచి ‘మై ఫాదర్ లవ్స్ మై మామ్’ అంటూ పాటపాడారు. ఈ వీడియోను విష్ణు షేర్ చేస్తూ 'ఈ సాంగ్ పూర్తయ్యేవరకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్స్ డార్లింగ్స్' అని రాసుకొచ్చారు.