షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై చీటింగ్ కేసు నమోదైంది. యూపీ లోని లఖ్‌నవూకు చెందిన తులసియానీ కన్‌స్ట్రక్షన్స్ కు గౌరీఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. గౌరీ ప్రకటన చూసిన జశ్వంత్ షా అనే వ్యక్తి రూ.86 లక్షలు చెల్లించి ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు. సకాలంలో ఫ్లాట్ ను ఇవ్వకపోవడంతో ఆయన ఆరా తీయగా ప్లాట్ ను వేరొకరికి అమ్మినట్లు తెలిసింది. దీంతో అతను ఎండీ, డైరెక్టర్ తో పాటు గౌరీఖాన్ పై కేసు పెట్టాడు.