చాన్నాళ్ల తరవాత విక్టరీ వెంకటేష్ హిందీలో నటిస్తున్న చిత్రం "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్". ఫర్హాద్ సంజి దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ రోజు ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ గా 'బిల్లి బిల్లి' ఫుల్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. బిల్లి బిల్లి ఆంఖే గోరియే .. అని సాగే ఈ పాటను సింగర్ సుఖ్ బీర్ సింగ్ స్వరపరచి, ఆలపించారు. కుమార్ లిరిక్స్ అందించారు. జీ స్టూడియోస్ తో కలిసి సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ ఏడాది ఈద్ కానుకగా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa